Header Banner

చర్లపల్లి- తిరుపతి ప్రత్యేక రైళ్లు! ఏపీలో రెండు రూట్లల్లో హాల్ట్ స్టేషన్లు..

  Sat Jun 14, 2025 09:28        Others

వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీ పెరగడం వల్ల, దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. చర్లపల్లి–తిరుపతి మధ్య ఇప్పటికే నడుపుతున్న 26 ప్రత్యేక రైళ్లను రద్దీ దృష్టిలో ఉంచుకొని మరింత పొడిగించాలని నిర్ణయించింది. సాధారణంగా ఈ రైళ్లు ఈ నెల మొదటివారంలో ముగియాల్సి ఉండగా, ప్రయాణికుల విజ్ఞప్తుల మేరకు ఈ నెల 27వ తేదీ వరకు ప్రతి శుక్రవారము, ఆదివారమున చర్లపల్లి నుండి రాత్రి 9:45కు బయలుదేరే నంబర్ 07017 ప్రత్యేక రైలు తిరుపతికి మరుసటి రోజు ఉదయం 11:15కు చేరుకుంటుంది. అలాగే తిరుపతి నుంచి ప్రతి సోమ, శనివారాల్లో సాయంత్రం 4:40 నిమిషాలకు బయలుదేరే నంబర్ 07018 ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 7:10 నిమిషాలకు చర్లపల్లికి చేరుకుంటుంది.

 

ఇది కూడా చదవండి:  మరో రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్! 3 గంటల్లో సికింద్రాబాద్! రూట్ ఇదే...!

 

అంతేకాకుండా, రైల్వే మరో ప్రత్యేక రైలు సర్వీసును కూడా ప్రకటించింది. నంబర్ 07251 రైలు ప్రతి బుధవారం సాయంత్రం 6:50 నిమిషాలకు చర్లపల్లి నుంచి బయలుదేరి, మరుసటి రోజు తెల్లవారు జామున 6:55 నిమిషాలకు తిరుపతికి చేరుకుంటుంది. అలాగే తిరుపతి నుంచి ప్రతి గురువారం సాయంత్రం 6:55 నిమిషాలకు బయలుదేరే నంబర్ 07252 రైలు, చర్లపల్లికి మరుసటి రోజు తెల్లవారు జామున 6 గంటలకు చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు మల్కాజ్ గిరి, కాచిగూడ, షాద్ నగర్, మహబూబ్ నగర్, కర్నూల్, కడప, రాజంపేట, రేణిగుంట వంటి ప్రధాన స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తాయి. ఈ ఏర్పాట్లు వేసవి సీజన్‌లో భక్తులు, పర్యాటకులు రద్దీ లేని ప్రయాణం చేయడానికి అనుకూలంగా ఉండనున్నాయి.

 

ఇది కూడా చదవండి: బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుందోచ్! ఆ ఒక్క జిల్లాలోనే 41 గ్రామాల్లో.. హాల్ట్ స్టేషన్లు ఇవే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

వైసీపీ హయాంలో మరో భారీ మోసం! సంచలన విషయాలు వెలుగులోకి...

 

తిరుమల లడ్డు ప్రసాదంపై మళ్ళీ వివాదం! ఈసారి...

 

కరెంట్ బిల్లు ఫోన్లో కడుతున్నారా..ఇలా చేయకండి! ఒక క్లిక్ తో రూ.2 లక్షలు పోయాయి!

 

ఏపీ రైతులకు బంపర్ ఆఫర్! వాటిపై 80% రాయితీ!

 

చాంగి ఎయిర్పోర్ట్ లో కలకలం! ఇద్దరు భారతీయ మహిళలు అరెస్ట్!

 

ఏపీ రైతులకు బంపరాఫర్.. 80శాతం రాయితీ, ఐదుగురు కలిసి రూ.2 లక్షలు కడితే చాలు!

 

 విద్యార్థులకు అదిరిపోయే న్యూస్! బస్ పాస్ లు ఉచితం! ఎవరెవరికంటే?

 

 తల్లికి వందనం లిస్ట్ లో మీ పేరు రాలేదా? వెంటనే ఈ పని చేయండి! ఆఖరి తేదీ..

 

మృతుల కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన టాటా గ్రూప్! ఒక్కొక్కరికి...

 

వాకింగ్ ఎంత సేపు చేయాలి! అతిగా నడిస్తే ఏం జరుగుతుంది?

 

10 నిమిషాల ఆలస్యమే తన ప్రాణాలు కాపాడింది! లక్ అంటే ఇదే మరి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #SpecialTrains #SummerRush #SouthCentralRailway #TirupatiSpecialTrain #CharlapalliToTirupati #RailwayUpdates #TTDTravels #PilgrimRush #TrainServices #IndianRailways